ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి
MDK: మెదక్ మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఛైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్తో కలిసి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజ సంస్కరణకు ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.