నగరం ఎస్ఐగా భార్గవ్ బాధ్యతలు

నగరం ఎస్ఐగా భార్గవ్ బాధ్యతలు

GNT: నగరం పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్ఐగా భార్గవ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన నగరం మండల పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరం మండల పరిధిలో నేరాలు నియంత్రించి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని చెప్పారు. ప్రజలు ఎవరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దన్నారు.