10 కోట్ల సామగ్రి రెడీ చేసిన NPDCL

10 కోట్ల సామగ్రి రెడీ చేసిన NPDCL

SRCL: సెస్ లైసెన్స్ ముగియడంతో ఎన్పీడీసీఎల్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. దీంతో ఎన్పీడీసీఎల్ అధికారులు వినియోగదారులకు చేరువయ్యే దిశగా చర్యలు చేపట్టారు. ఎన్పీడీసీఎల్ అధీనంలోకి వెళ్లిన మూడు రోజుల్లోనే రూ.10 కోట్ల విలువైన సామగ్రి పెద్దూర్లోని సెస్ స్టోర్ రూమ్‌కు చేరుకుంది. 110 ట్రాన్స్ ఫార్మర్లతో పాటు సామగ్రి, సిబ్బంది రక్షణకు అవసరమైన కిట్లను అందుబాటులో ఉంచారు.