'ప్రజాతీర్పును అధికార బలం వెక్కిరిస్తోంది'
RR: ఇబ్రహీంపట్నంలో ప్రజాతీర్పును అధికార బలం వెక్కిరిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో 15 మంది కౌన్సిలర్ల మద్దతుతో బీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ సాధించినా, 8 స్థానాలున్న కాంగ్రెస్ కూడా పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కిడ్నాప్ రాజకీయాలు, అధికారులపై ఒత్తిళ్ల నేపథ్యంలో మున్సిపల్ రాజకీయ చదరంగంలో ఎవరికెవరు చెక్ పెడతారో చూడాలి.