'పరిగి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి చర్యలు'
VKB: పరిగి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కోసం పాలకవర్గ సభ్యులు తెలంగాణ, మహారాష్ట్రలోని పలు మార్కెట్ యార్డులను సందర్శించనున్నారు. నిజామాబాద్, నాందేడ్, సోలాపూర్, పుణే ప్రాంతాల మార్కెట్లను పరిశీలించి అక్కడి ఉత్తమ విధానాలను పరిగిలో అమలు చేస్తామని మార్కెట్ కమిటీ ఛైర్మన్ పరశురాం రెడ్డి తెలిపారు. రైతులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి పండ్లు, అమ్మకాలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.