VIDEO: జిల్లాలో వడగళ్ల వాన
SKLM: మెళియాపుట్టి మండలం జాడుపల్లి గ్రామంలో వడగళ్ల వాన కురిసింది. గురువారం ఉదయం నుంచి ఎండ తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం వాతావరణంలో ఒక్కసారి మార్పులు జరిగి ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన పడింది. దీంతో ప్రజలకు ఉపశమనం కలిగింది. ఈ జల్లులు మామిడి, జీడిపంటలకు నష్టం కలుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.