VIDEO: యూరియా కోసం క్యూలైన్లలో నిరీక్షిస్తున్న రైతులు

KNR: ఖాసింపేటలోని రైతు వేదిక వద్ద గురువారం ఉదయం నుంచి రైతులు యూరియా కోసం క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. యూరియా అందక నిరీక్షించిన రైతులు తమ స్థానాలను కాపాడుకోవడానికి చెప్పులు, రాళ్లను లైన్లలో పెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. ఈ పరిస్థితిపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.