VIDEO: విద్యార్థి నోటికి ప్లాస్టర్ వేసిన టీచర్

RR: పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలు దారుణానికి ఒడిగట్టిన ఘటన మన్సురాబాద్‌లో గురువారం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న విద్యార్థిని టీచర్ కొట్టడమే కాకుండా, నోటికి ప్లాస్టర్ వేసి మాట్లాడకుండా చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.