వెంకట్ వకుళ ఫౌండేషన్ ఛైర్మన్‌కు సన్మానం

వెంకట్ వకుళ ఫౌండేషన్ ఛైర్మన్‌కు సన్మానం

ATP: ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం సందర్భంగా వెంకట్ వకుళ ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట నరసనాయుడు ఆలంను ట్రస్ట్ ఛైర్‌పర్సన్ నారా భువనేశ్వరి ఘనంగా సన్మానించారు. సమాజ సేవలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం అందజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. ఆయన సేవా కార్యక్రమాలు మరెందరికో ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు.