ఎంజీఎంలో వైద్య సేవలపై విమర్శలు

ఎంజీఎంలో వైద్య సేవలపై విమర్శలు

WGL: నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. బొల్లికుంటకు చెందిన శ్రీనివాస్ కాలు ఇన్‌‌ఫెక్షన్‌తో చికిత్స కోసం నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు పరీక్షల పేరుతో వేచి ఉండాల్సి వచ్చింది. ఉన్నతాధికారులు రావాలని చెప్పుతూ కాలయాపన చేసినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అత్యవసర రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదని ఆరోపించాడు.