తిరుమలలో హై అలెర్ట్..!

CTR: జమ్మూ కశ్మీరులో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో తిరుమలలో సెక్యురిటీని టీటీడీ కట్టుదిట్టం చేసింది. తిరుమల ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏ చిన్నపాటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు.