ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం: లక్ష్మణ్ బాబు
MLG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని BRS ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబురావు అన్నారు. BRS అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేసే ముందు తెలంగాణ భవన్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లక్ష్మణ్ బాబు పాల్గొని మాట్లాడారు. సునీతను గెలిపించాలని కోరారు.