భారీగా ఎన్నికల బందోబస్త్ చేశాం: SP
ADB: ఎన్నికల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 1000 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. బందోబస్తులో ముగ్గురు అదనపు ఎస్పీలు, 3 డీఎస్పీలు, 21 మంది సీఐలు, 48 ఎస్సైలతో, మహిళా సిబ్బంది, హోంగార్డ్స్, రిజర్వు సిబ్బంది, సాయుధ సిబ్బంది, స్పెషల్ పార్టీ బలగాలచే బందోబస్త్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.