రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

పల్నాడు జిల్లాలోని ఎడ్లపాడు సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన టాటా ఇంట్రా వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాల తెలియాల్సి ఉంది.