పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ప్రభుత్వ విప్

పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ప్రభుత్వ విప్

SRCL: బోయినపల్లి మండలం స్తంభం పల్లి గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు.