ఇవాళ్టి నుంచి అమరావతిలో రెవెన్యూ మేళాలు
AP: రాజాధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో ఇవాళ్టి నుంచి 17 వరకు రెవెన్యూ మేళాలు నిర్వహించనున్నారు. కాగా, గ్రామాల్లోని రెవెన్యూ సమస్యలను ప్రజలు ఇటీవల మంత్రి నారాయణకు విన్నవించిన సంగతి తెలిసిందే.