రైతులకు జాతీయ జెండాల పంపిణీ

GDWL: అయిజ మండలం బింగిదొడ్డిలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి రైతులకు గురువారం జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతో మంది మహనీయులు త్యాగాలు చేశారని గుర్తుచేశారు. ప్రజలలో దేశభక్తి, ఐక్యత భావనను పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని తెలిపారు.