ఆర్చరీ ఛాంపియన్‌షిప్.. ఫైనల్‌లో భారత్
ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ అదరగొడుతోంది. అభిషేక్ వర్మ, దీప్షికల జంట కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్‌లో ఈ రెండో సీడ్ భారత ద్వయం 156-153తో కజకిస్తాన్ జోడీపై గెలుపొందింది. దీంతో అభిషేక్, దీప్షిక ఫైనల్‌లో బంగ్లాదేశ్ జంటను ఢీకొట్టనున్నారు.