జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం: మంత్రి
JGL: మహాత్మ జ్యోతిబాఫూలే సేవలు చిరస్మరణీయమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన ఫూలే జయంతి ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో MLA సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్ లత, మున్సిపల్ చైర్ పర్సన్, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.