వైజాగ్‌లో ముక్కామలకు చెందిన యువకుడి మృతి

W.G: వైజాగ్‌లోని దివీస్‌లో పనిచేస్తున్న పెరవలి మండలం ముక్కామలకు చెందిన మధు మోహన్ మంగళవారం మృతి చెందాడు. మోహన్ దివీస్‌లో పనిచేస్తూ హాస్టల్లో ఉంటున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని హాస్టల్‌కి వచ్చాడు. అనంతరం ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.