కూసుమంచి సర్పంచ్‌గా కృష్ణవేణి గెలుపు
KMM: కూసుమంచి మండల మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా కృష్ణవేణి విజయం సాధించారు. అత్యధిక ఓట్లతో సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆమెకు మద్దతుగా గ్రామస్థులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ ఎన్నికతో కూసుమంచి ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమైంది. ఆమె మాట్లాడుతూ.. తనను ఆశీర్వదించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.