టెట్ పరీక్షకు 75 మంది గైర్హాజరు
కర్నూలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) ప్రారంభమయ్యాయి.మొదటిరోజు 665 మంది అభ్యర్థులకు గానూ 590 మంది హాజరయ్యారు. 75 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. టెట్ పరీక్ష ఈ నెల 21 వరకు కొనసాగుతుందని చెప్పారు. ఎంఈవోలు ఆదాం బాషా, వనజ కుమారి తదితరులు డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్‌లుగా వ్యవహరించారు.