నడిరోడ్డుపై బైక్ దగ్ధం

నడిరోడ్డుపై బైక్ దగ్ధం

WNP: శ్రీరంగాపూర్ మండల పరిధిలోని వెంకటాపూర్ చౌరస్తాలో బుధవారం ప్రమాదవశాత్తు ఓ బుల్లెట్ బైక్ దగ్ధమైంది. అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన మహేష్ బైక్‌లో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఉండడంతో లీకేజీ కారణంగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంటలు ఎగిసి పడటంతో ప్రయాణికులు, వాహనదారులు భయాందోళనకు చెందారు.