ధ్వజ స్తంభం ప్రతిష్ట కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరు
E.G: రాజమండ్రిలోని 46వ డివిజన్ వెంకటాపురం రామాలయం వద్ద సోమవారం జరిగిన ధ్వజ స్తంభం ప్రతిష్ట కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ మేరకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, ఆలయ గర్భాలయంలోని మూలవిరాట్టు దృష్టికి ఎదురుగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.