VIDEO: బజ్జీలు మీకు.. ఓట్లు నాకు: సర్పంచ్ అభ్యర్థి

VIDEO: బజ్జీలు మీకు.. ఓట్లు నాకు: సర్పంచ్ అభ్యర్థి

MDK: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజున చిన్న శంకరంపేట సర్పంచ్ అభ్యర్థి, NRI చంద్రశేఖర్ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. ఆయన స్థానికంగా ఉన్న ఓ టీ హోటల్‌కు వెళ్లి, స్వయంగా బజ్జీలు వేసి ఓటర్లను ఆకట్టుకున్నారు. "బజ్జీలు మీకు.. ఓట్లు నాకు" అంటూ చమత్కరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన వేసిన బజ్జీలను అక్కడే ఉన్న అందరికీ పంచిపెట్టారు.