బీసీల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే
KRNL: బీసీల సంక్షేమం, అభివృద్ధే తమ లక్ష్యమని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. సోమవారం మంత్రాలయం మండలం సుంకేశ్వరిలో బీసీ(కురుమ) కమ్యూనిటీ నిర్మాణానికి రూ.15.20 లక్షలు మంజూరైన రాజ్యసభ ఎంపీ నిధులను గ్రామస్థులకు ఆయన అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో బీసీలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. బీసీల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.