VIDEO: ఈనెల 27 నుంచి ఆలయంలో కళ్యాణోత్సవాలు

VIDEO: ఈనెల 27 నుంచి ఆలయంలో కళ్యాణోత్సవాలు

కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలిలోని శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 27 నుంచి మే 1వ తేదీ వరకు కళ్యాణోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో బి. వెంకటరమణ తెలిపారు. ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు, గ్రామోత్సవం, సదస్యం, త్రిశూల స్నానం, పుష్పయాగం జరగనున్నాయని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.