ఆర్టీసీ డిపోను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే వినతి

కోనసీమ: అమలాపురం ఆర్టీసీ డిపోను అభివృద్ధి చేయాలని స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనగల్ల నారాయణరావుని శుక్రవారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా ప్రధాన కేంద్రంలోని ఆర్టీసీ డిపోను మరింత అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలని కోరారు.