నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
MDCL: విద్యుత్ లైన్ల నిర్వహణలో భాగంగా ఇవాళ కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ ఏ. శశిధర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు రేణుక ఎల్లమ్మ, సాయి అనురాగ్, కౌసల్య కాలనీల్లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరా నగర్, SC కాలనీ, కాకతీయనగర్, హిల్ కౌంటీ రోడ్డు, బాచుపల్లి గ్రామపంచాయతీ ఏరియాల్లో విద్యుత్ సరఫరా ఉండదని వివరించారు.