నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన మంత్రి
VZM: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి పురస్కరించుకుని గంట్యాడ మండలంలోని నరవగ్రామంలో నిరుపేదలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దుప్పట్లు పంపిణీ చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.