62 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం
HNK: హసన్‌పర్తి మండల కేంద్రంలోని నల్ల సత్యనారాయణ (65) నివాసంలో అక్రమంగా నిలువచేసిన రేషన్ బియ్యాని ఇవాళ టాస్క్‌ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో సుమారు రూ. 2.17 లక్షల విలువ చేసే 62 క్వింటాళ్ల బియ్యాని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన సత్యనారాయణ, ఓర్సు భానుపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు.