VIDEO: నర్సంపేటలో భారీ అగ్నిప్రమాదం..!
WGL: నర్సంపేట పట్టణం పోలీస్ స్టేషన్ ఎదురుగా మాదన్నపేట రోడ్డు మూలలోని ఒక జనరల్ స్టోర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రబలినట్లు ప్రాథమిక సమాచారం. దుకాణం పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో లోపల ఉన్న సరుకులన్నీ కాలిపోయాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.