నానో యూరియా ఉపయోగంపై రైతులకు అవగాహన

NLG: నానో యూరియా ఉపయోగంపై మునుగోడు వ్యవసాయ అధికారి ఎస్.పద్మజ రైతులకు అవగాహన కల్పించారు. గురువారం మునుగోడు ప్రాథమిక సహకార సంఘంలో యూరియా సరఫరాపై ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నానో యూరియూ గురించి రైతులకు వివరించారు. నానో టెక్నాలజీ అనేది సైన్స్, ఇంజినీరింగ్ కలబోత అన్నారు. పరిమాణము మారదు కాని ఉపరితల వైశాల్యం పెరుగుతుందన్నారు.