పశువుల నీటి తొట్లు ఉపయోగంలోకి తేవాలి

SRD: పశువుల దాహార్తి తీర్చేందుకుగాను పలు గ్రామాల్లో నీటి సరఫరా బోర్ల వద్ద EGS అభివృద్ధి నిధులతో గతంలో నీటి తొట్లు నిర్మించారు. అయితే పంచాయతీ అధికారుల నిర్వహణ లోపంతో అవి ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. కోహిర్ మండలంలోని బడంపేట, పైడి గుమ్మాల్, బిలాల్పూర్ గ్రామాల్లో పశువుల తొట్లు శిధిలమవుతున్నాయి. సత్వరమే వీటిని ఉపయోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.