గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం సమీక్ష
HYD: తెలంగాణలో గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రధాన ఆలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు టెక్నికల్ ఇంజనీర్ల కమిటీని నియమించాలని అధికారులను సీఎం ఆదేశించారు.