ఆకట్టుకుంటున్న చిన్నారుల వేషధారణ

MHBD: కృష్ణాష్టమి సందర్భంగా గార్లలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చిన్నారులచే రాధాకృష్ణుల వేషధారణ ఆకట్టుకుంటున్నాయి. అమ్మాయిలు రాధా వేషధారణ, అబ్బాయిలు శ్రీకృష్ణుడి వేషధారణతో అలరించారు. అనంతరం పిల్లలచే ఉట్టి కొట్టే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల తల్లితండ్రులు మాట్లాడుతూ.. మన సాంస్కృతి సంప్రదాయాలను మనమే కాపాడుకోవాలన్నారు.