ఏడుబావుల వద్ద జిల్లా యువకుడి గల్లంతు

KMM: ఏడుబావుల వద్ద ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఏన్కూరు మండలం జెన్నారం ఎస్టీ కాలనీకి చెందిన ప్రాపర్తి ప్రేమ్ కుమార్ తన బంధువులు, స్నేహితులతో కలిసి ఏడుబావుల జలపాతం చూసేందుకు వచ్చాడు. జలపాతం వద్ద పైన ఉన్న బావులను చూసేందుకు వెళ్తున్న క్రమాన ప్రమాదవశాత్తు జారి బావిలో పడినట్లు తెలుస్తోది. ఆయన సహచరులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. గాలింపు చర్యలు కొనసాగుతుంది.