5 నుంచి పాలిటెక్నిక్ ఉచిత శిక్షణ

SRD: సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో 5వ తేదీ నుంచి ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జానకి దేవి శనివారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు శిక్షణ జరుగుతుందని చెప్పారు. పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.