కూకట్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
HYD: కూకట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. మూసపేట కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా విధులు నిర్వహిస్తున్న మురళి, ఒక పని కోసం రూ.18 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. నెలరోజుల వ్యవధిలోనే ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు ఏసీబీకి చిక్కడం స్థానికంగా కలకలం రేపుతోంది. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.