రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఇవాళ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, మందుల నిల్వల రిజిస్టర్‌తో పాటు ఇతర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు.