ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి

NTR: తిరువూరు జైభావి సెంటర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో వృద్ధురాలు యార్లగడ్డ రోశమ్మ (84) అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న తిరువూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మరణించిన మహిళ గంపలగూడెం మండలం కనుమూరు గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.