ఎన్నికల విధులకు డుమ్మా.. షోకాజ్ నోటీసులు
NGKL: గద్వాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల శిక్షణకు హాజరుకాని 206 మంది పోలింగ్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు శిక్షణకు హాజరు కాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర్వులను అతిక్రమించినందుకు వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని అన్నారు.