INS విక్రాంత్ అరుదైన ఘనత
భారత నౌకాదళ గర్వకారణం INS విక్రాంత్ (R11) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ యుద్ధనౌకపై విజయవంతంగా 1,000వ 'అరెస్టెడ్ ల్యాండింగ్' పూర్తయింది. స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్, తన కార్యాచరణ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకుంది. సముద్ర భద్రతలో భారత్ సాధించిన ఈ మైలురాయి దేశ రక్షణ రంగానికి ఎంతో కీలకమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.