బంగారు దొంగతనం.. ఏడాది పాటు జైలు శిక్ష
NLR: వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసులో నెల్లూరు జడ్జి సోమశేఖర్ ముద్దాయికి ఏడాది పాటు జైలుశిక్ష విధించారు. 2017 అక్టోబర్ 25వ తేదీన బీవీ నగర్‌కు చెందిన వ్యక్తికి నిందితుడు ఆహార పదార్ధాలలో మత్తు పదార్థం కలిపి రూ. 3.50 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.