బీజేపీ బహిరంగ సభకు చిట్వేల్ నుంచి భారీ వాహన ర్యాలీ

అన్నమయ్య: చిట్వేలు మండలంలో నుంచి ఆకేపాట్టి వెంకటరెడ్డి, టి.సుబ్బరాయుడు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బాపూజీ సమన్వయంతో భారీ వాహన ర్యాలీ ఏర్పాటు చేశారు. గ్రామాల వారీగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు వందలాది వాహనాలతో చిట్వేలు నుండి రాయచోటికి బయలుదేరారు. చిట్వేలు మండలం నుంచి ఈ స్థాయిలో వచ్చిన జన సమూహం సభ విజయానికి తోడ్పడనుందని పార్టీ శ్రేణులు నమ్ముతున్నాయి.