మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ATP: గార్లదిన్నె మండల కేంద్రంలో ముస్లిం మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వతరగతి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు 5వ తరగతిలో ప్రవేశాలకు 6,7,8వ తరగతిలో మిగులు సీట్లకు ఈనెల 31వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 24 న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.