ఇంటి ముందు బైక్ దగ్ధం
SRD: కంది గ్రామంలో ఇంటి ముందుకు పార్క్ చేసిన బైక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి దగ్ధం చేసిన ఘటన చోటు చేసుకుంది. రెండో వార్డ్‌కు చెందిన పాండు మంగళవారం రాత్రి 10 గంటలకు బైక్‌ను నిలిపి ఇంట్లోకి వెళ్లగా, తరువాత గుర్తు తెలియని వ్యక్తులు దానిని కాల్చివేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపారు.