VIDEO: కంకర పొడితో వాహనదారులకు ఇబ్బందులు

VIDEO: కంకర పొడితో వాహనదారులకు ఇబ్బందులు

MBNR: బాలానగర్ మండలం గుండేడు గ్రామానికి వెళ్లే రహదారిపై బీటీ రోడ్డు నిర్మాణానికి కొన్ని నెలల క్రితం కంకర పోశారు, కానీ ఇప్పటివరకు పనులు పూర్తి చేయలేదు. ఈ రోడ్డుపై భారీ వాహనాలు ప్రయాణించినప్పుడు కంకర పొడి గాలిలో లేచి కళ్లలో పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే బీటీ రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.