సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

HYD: ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చిల్కానగర్ డివిజన్‌లో 80 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ల అభివృద్ధి పనులకు ఈరోజు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... సీసీ రోడ్డు నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమలో చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొన్నారు.