ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

JN: పట్టణ కేంద్రంలో ప్రపంచ ఫోటోగ్రఫీ డే ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్‌లు ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ మండే డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సృజనాత్మకతతో సమాజంలో చైతన్యం కలిగించేలా ఫోటోగ్రఫీ వేదిక కావాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక ఫోటోగ్రాఫర్లు తదితరులున్నారు.